Site icon Prime9

LSG Captain: చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్.. లక్నోకు కొత్త కెప్టెన్

LSG Captain

LSG Captain

LSG Captain: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో మరో జట్టుకు కొత్త కెప్టెన్‌ వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు తాత్కాలిక కెఫ్టెన్ గా కృనాల్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన గత మ్యాచ్ లో రెగ్యులర్ కెఫ్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఈ లీగ్ లో తర్వాతి మ్యాచ్ లో రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యా కెఫ్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని లక్నో టీం యాజమాన్యం అధికారింగా ప్రకటించింది.

 

కృనాల్ నేతృత్వంలో(LSG Captain)

మే 3(బుధవారం)న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో లక్నోకు కృనాల్ నేతృత్వం వహిస్తాడని తెలిపింది. కేఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉందని.. ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా పర్యవేక్షిస్తుందని పేర్కొంది. అదే విధంగా ఐపీఎల్ తర్వాత మ్యాచుల్లో రాహుల్ ఆడాలా..లేదా అనే విషయాన్ని కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.

జూన్ 7 న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉన్నందున రాహుల్ గాయాన్ని బీసీసీఐ చాలా సీరియస్ గా తీసుకుంటుందని.. ఈ విషయంలో ఎన్సీఏ మెడికల్ టీమ్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో బౌండరీని ఆపే క్రమంలో ఛేజ్ చేస్తూ.. రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ మ్యాచ్ లోనే రాహుల్ స్థానంలో కృనాల్ తాత్కాలికంగా కెఫ్టెన్ గా ఉన్నాడు.

 

లక్నో కు గట్టి ఎదుర దెబ్బ

మరో వైపు రాహుల్ లేకపోవడం లక్నో కు గట్టి ఎదుర దెబ్బ అనే చెప్పాలి. ప్రస్తుత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 9 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచుల్లో విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. లీగ్‌ ఇపుడు కీలక దశకు చేరగా.. గాయం కారణంగా రాహుల్‌ దూరం కావడం లక్నో టీమ్‌పై మరింత ప్రభావం చూపనుంది. ప్రస్తుతం లక్నో ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. కాగా ఈ రేసులో టాప్ లో గుజరాత్‌, రెండో స్థానంలో రాజస్థాన్‌ , నాల్గో స్థానంలో చెన్నై , ఆర్సీబీ, పంజాబ్‌ లు 5,6 స్థానాలతో ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నాయి.

 

 

Exit mobile version