Site icon Prime9

IPL 2025: నేడు కీలక మ్యాచ్.. కోల్‌కతా‌తో హైదరాబాద్ ఢీ

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు 15వ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య కీలక మ్యాచ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. కాగా, గత సీజన్‌లో ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడగా.. తాజాగా, ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. కానీ తర్వాతి రెండు మ్యాచ్‌లు వరుసగా ఓటమి చెందడంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితమైంది.

అయితే, ఇరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 18 సార్లు విజయం సాధించగా.. హైదరాబాద్ 9 సార్లు మాత్రమే గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పట్టు బలంగా ఉంది. నరైన్, రస్సెల్, అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే హైదరాబాద్ జట్టులో కూడా హెడ్, అభిషేక్, అనికేత్ వంటి హిట్టర్స్ ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar