Site icon Prime9

KL Rahul Wedding: క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి.. సునీల్ శెట్టి ఫాంహౌజ్ లో సెలబ్రేషన్స్ స్టార్ట్

Rahul -athiya

Rahul -athiya

KL Rahul Wedding: భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Sunil shetty) కుమార్తె అతియా శెట్టితో రాహుల్ వివాహం జరుగనుంది.

అతియా శెట్టి(Athiya shetty), కేఎల్ రాహుల్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ జంట పెళ్లి జనవరి 23 న ఖండాలాలోని సునీల్ శెట్టి ఫాంహౌజ్ లో జరగనుంది.

అదే విధంగా ఈ పెళ్లికి ఇద్దరి తరపు నుంచి దగ్గరి సన్నితులు హాజరవుతారని సమాచారం.

మొదలైన పెళ్లి వేడుకలు

ఈ నెల 22 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మెహందీ తో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సంగీత్, హల్దీ కార్యక్రమాలు ఉంటాయి.

ఈ క్రమంలో ముంబైలోని పాలి హిల్ లోని కేఎల్ రాహుల్ ఇంటిని లైట్లతో తీర్చిదిద్దారు.

దీంతో సంబరాలు మొదలయ్యాయని భావిస్తున్నారు. ఇక సునీల్ శెట్టి ఖండాలా ఇంటిని కూడా అందంగా తీర్చి దిద్దారు.

ఇంటి ముందు ఉన్న గ్రౌండ్ లో అందమైన మండపాన్ని రూపొందిస్తున్నారు.

పెళ్లి అనంతరం ముంబై లోని ఓ స్టార్ హోటల్ లో రిసెప్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఫొటోస్ కు నో ఎంట్రీ

పెళ్లికి వచ్చే అతిధులకు సునీల్ శెట్టి కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. వేడుకకు సంబంధించి ఎటువంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోవద్దంటూ సూచించినట్టు సమాచారం.

అదేవిధంగా అతిథుల ఫోన్లు కూడా దూరంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

అయితే ఈ జంట వివాహానికి అటు క్రీడారంగం, ఇటు బాలీవుడ్ నుంచి కూడా సెలబ్రిటీలు హాజరవుతున్నట్టు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్ తో పాటు విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, మరికొందరు క్రికెటర్లు ఈ పెళ్లి లో సందడి చేయనున్నట్టు టాక్.

 

కాగా, ఇప్పటికే కెఎల్ రాహుల్(KL Rahul) శ్రీలంక తో జరిగిన టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. అయితే పెళ్లి కోసమే తను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్టు క్రికెట్ వర్గాల సమాచారం.

టీ20 వరల్డ్ కప్ , ఆ తర్వాత రాహుల్ ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దీంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తెగా ఇండ్రస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల భామ అతియా శెట్టి. హీరో సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా అవి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version