KL Rahul Wedding: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడయ్యాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె నటి అతియా, కేఎల్ రాహుల్ కొన్నాళ్లు లో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
మహారాష్ట్రలోని ఖండాలా లోని సునీల్ శెట్టి ఫాంహౌజ్ లో సోమవారం ఘనంగా వివాహం జరిగింది.
ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది బంధువులు, ఫ్రెండ్స్ సమక్షంలో రాహుల్ , అతియా జంట ఒక్కటయ్యారు.
ఈ పెళ్లికి హీరో సల్మాన్ ఖాన్ తోపాటు క్రికెటర్ ఇషాంతశర్మ, వరుణ్ ఆరోన్ లు హాజరై.. కొత్త జంటను ఆశీర్వదించారు. పె
ళ్లి అనంతరం ఈ జంట బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా, పెళ్లికి సంబంధించిన ఫొటోలను రాహుల్, అతియా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
అందరి ఆశీస్సులు కావాలి
అతియా వెలుగులో తాను ప్రేమించడం నేర్చుకన్నట్టు కేఎల్ రాహుల్ అన్నాడు.
ఈ రోజు అత్యంత ఇష్టమైన వ్యక్తుల మధ్య మా ఇద్దిరి పెళ్లి జరగడం చాలా ఆనందంగా ఉందని రాహుల్ తెలిపాడు.
ఈ కొత్త జర్నీకి అందరి ఆశీస్సులు కావాలని రాహుల్ కోరాడు.
సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పంచుకున్న అతియా .. ఎలా ప్రేమించాలో నేర్చుకుంటానని తెలిపింది.
ఈ రోజు జీవితం లో మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చిందని.. సన్నిహితుల మధ్య మేము ఒక్కటవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.
అందరి కృతజతలు, ప్రేమ , ఆశీర్వాదాలు తమ ప్రయాణంలో తోడు ఉండాయని కోరుకుంటున్నట్టు అతియా ఫోస్ట్ చేసింది.
ఐపీఎల్ తర్వాత రిసెప్షన్
పెళ్లి దుస్తుల్లో కేఎల్ రాహుల్, అతియా మెరిసిపోయారు. ఈ వివాహం గురించి సునీల్ శెట్టి తన హ్యాపీనెస్ ను మీడియాతో పంచుకున్నాడు.
తాను మామయ్య అయ్యానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కుమార్తె పెళ్లి ఘనంగా జరిగిందని, ఐపీఎల్ తర్వాత రిసెప్షన్ జరుగుతుందని తెలిపాడు.
శుభాకాంక్షలు వెల్లువ
నూతన వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ, సూర్య కూమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్.. తదితరులు రాహుల్-అతియా కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్.. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ కు దూరంగా ఉన్నాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/