CSK vs KKR: చెన్నై భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్ లో అజింక్యా రహానే విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు. శివం దూబే, కాన్వే కూడా అర్దసెంచరీలతో రాణించారు. ఇక చివర్లో జడేజా 8 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దీంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది.
కోల్ కతా బౌలర్లలో.. కెర్జోలియా రెండు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.