SRH vs DC: ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 రన్స్ చేసింది. దానితో ఢిల్లీ జట్టు టార్గెట్ 198 రన్స్ గా ఉంది. పవర్ ప్లే మరియు ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ జట్టు బ్యాటర్లు బాగా పర్ఫార్మ్ చేశారనే చెప్పాలి. అభిషేక్ శర్మ(36 బంతుల్లో 67 పరుగులు) మరియు క్లాసెస్(27 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్) హాఫ్ సెంచరీలు జట్టుకు ఓ మంచి స్కోర్ ఇచ్చాయి. ఐపీఎల్ 2023లో భాగంగా హోంటౌన్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. డిల్లీ బౌలర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు.
ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో రెండు జట్లకూ నాలుగు పాయింట్లు ఉన్నాయి. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు మ్యాచులు గెలిచి 9 స్థానంలో ఉండగా, వరుస పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.