RR vs RCB: 172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. హెట్ మెయిర్ (35) రూట్(10) తప్ప మిగిలిన వారంతా వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. రాజస్థాన్ జైపూర్ లోని స్వామీ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడి బెంగుళూరు టీం ఘన విజయం సాధించింది. ఆర్ఆర్ కెరియర్లో ఇది సెకెండ్ లోయెస్ట్ స్కోర్ అని చెప్పవచ్చు. ఆర్సీబీ బౌలింగ్లో ఘన విజయం సాధించింది. ఫార్నెల్ 3 తీయగా బ్రేస్వెల్, కర్ణ్ చెరో రెండు వికెట్లు తీశారు. జంపా, ఆసిఫ్, సందీప్ శర్మ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్, డుప్లెసిస్ చెరో హాఫ్ సెంచరీ చేశారు.
ఈ విజయంతో బెంగుళూరు జట్టు పాయింట్ల పట్టికలో 6 మ్యాచులు గెలిచి 12 పాయింట్లతో ఐదోస్థానంలో ఉండగా రాజస్థాన్ జట్టు 13 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది.