PBKS vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ముందు పంజాబ్ భారీ స్కోర్ ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కింగ్స్ జట్టు 214 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ ((82 నాటౌట్; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా నిలిచాడు. హాఫ్ సెంచరీకి ఒక అడుగు దూరంలో జితేశ్ శర్మ(49 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ) నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 214గా ఉంది. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 215 రన్స్ గా ఉంది. ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్ మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో హోంటౌన్లో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. ఇకపోతే ముంబై బౌలర్స్ పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా, అర్షద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఐదు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగు మ్యాచుల్లో గెలిచి ఏడో స్థానంలో ఉంది.