Site icon Prime9

Mumbai Indians : హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ ఇంట్లో సందడి చేసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్స్..

mumbai indians players visited thilak varma house and photos goes viral

mumbai indians players visited thilak varma house and photos goes viral

Mumbai Indians : తిలక్ వర్మ.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఈ హైదరాబాదీ ప్లేయర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన ప్రతిభ కనబరుస్తూ రోహిత్ సేనకు కొండంత అండగా నిలుస్తున్నాడు ఈ యంగ్ బ్యాట్స్ మెన్. ముంబై ఇండియన్స్ ను ఆడిన నాటి మేటి సేవియర్ అంబటిరాయుడు లాగానే తిలక్ వర్మ అంబానీ జట్టుకు ప్రస్తుతం ఆపద్బాంధవుడు పాత్ర పోషిస్తున్నాడు. అతి తక్కువ కాలం లోనే సచిన్, సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గాజాల ప్రశంసలు అందుకున్న ప్లేయర్ గా తిలక్ వర్మ మంచి పేరు సంపాదించుకున్నాడు.

కాగా ప్రస్తుతం ఐపీఎల్ -2023 సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. దాదాపు అన్ని మ్యాచ్‌లు చివరి బంతి వరకు విజయం ఏ జట్టును వరిస్తుందో చెప్పలేకపోతున్నారు. కాగా ఈరోజు సన్ రైజర్స్.. ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ముంబై ఇండియన్స్ టీం సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. టీం సభ్యులు హైదరాబాద్ రావటంతో వారికి.. తిలక్ వర్మ సోమవారం రాత్రి తన ఇంట్లో విందును ఇచ్చారు. ఈ విందులో సచిన్ టెండుల్కర్, సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్, కెప్టెన్ రోహిత్ శర్మతో సహా టీం సభ్యులందరూ పాల్గొని సందడి చేశారు. తిలక్ వర్మ, అతని కుటుంబ సభ్యులు సచిన్, ఇతర టీం సభ్యులతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తిలక్ వర్మ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ముంబై ఇండియన్స్ సభ్యులకు నా ఇంటి వద్ద విందుకోసం ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, నేను మర్చిపోలేని రాత్రి ఇది. ఆహ్వానం మన్నించి ఇంటికి వచ్చినందుకు టీం సభ్యులకు ధన్యవాదాలు అంటూ తన ట్వీట్ కు తిలక్ వర్మ క్యాప్షన్ ఇచ్చాడు. అతని పోస్ట్ కు పలువురు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్ లో తిలక్ వర్మ నాలుగు మ్యాచ్‌లలో 59 సగటుతో 150 స్ట్రైక్ రేట్ తో 177 పరుగులు చేశాడు. అలానే ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాగా నేటి మ్యాచ్ కోసం ఉప్పల్ కి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

మరోవైపు రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడిన వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోకు క్యాప్షన్ కూడా ‘కెప్టెన్ రోహిత్‌ హైదరాబాద్ వచ్చేసాడు’అని తెలుగులో పెట్టింది. ఈ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ..’ముంబై ఫ్యాన్స్.. మేం వచ్చేస్తాం.. పదండి ఉప్పల్‌కు’అని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఫిదా అయిన ఫ్యాన్స్.. రోహిత్ శర్మ స్వాగతం పలుకుతూ కామెంట్లు చేశారు.

Exit mobile version
Skip to toolbar