MI vs RR: ఐపీఎల్-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ టీం ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 213.
ఆర్ఆర్ టీం యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. 62 బంతులకు 124 పరుగులు చేశాడు. దానితో ముంబై ముందు మంచి టార్గెట్ స్కోర్ ఉంది.