LSG vs RCB: మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. దానితో లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 127 రన్స్ గా ఉంది. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు 43వ మ్యాచ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేపీ ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. కాగా హోంటౌన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంతో తలపడుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో లక్నో టీం 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, బెంగళూరు జట్టు 6వ స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి పాయింట్ల పట్టికలో స్థానాలు తారుమారు అవుతాయి.