KKR vs GT: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు హోం టైన్ లో ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయకేతనం ఎగురవేసింది. ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ పై గుజరాత్ విజయం సాధించింది.
లాస్ట్ రెండు ఓవర్లలో విజయ శంకర్ (51 నాటౌట్) మరియు మిల్లర్ల(32 నాటౌట్) ధ్వయం బౌండరీల వర్షం కురిపించడంతో గెలుపు సునాయాసం అయ్యింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టీం ఇంకా రెండు ఓవర్ల ఒక బాల్ మిగిలిండగానే మ్యాచ్ ను ముగించేసింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 180/3 రన్స్ చేసింది.