IPL 2023 Punjab vs Kolkata: ఐపీఎల్ సీజన్ 16 లో పంజాబ్ కింగ్స్ విజయంతో ఆరంభంచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 7 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్స్ లో 191/5 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ఛేదనకు దిగిన కోల్ కతా కు వరుణుడు అడ్డు తగిలాడు. మరో 4 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుంది అనగా భారీ వర్షం పడింది. దీంతో ఆటను ఆపేశారు. చాలా సేపు ఎదురు చూసినప్పనటికీ వర్షం ఆగకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానంలో పంజాబ్ జట్టును విన్నర్ గా ప్రకటించారు. దీంతో ఈ సీజన్ లో డక్ వర్త్ లూయిస్ విధానంలో గెలిచిన మొదటి జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది.