IPL 2023 GT vs PBKS: ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమయ్యింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. గతసంవత్సరం డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ కు ఇటీవల జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కోలుకోలేని దెబ్బకొట్టింది. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ అద్భుతమై బ్యాటింగ్ తో మైదానంలో దుమ్మురేపాడు. దానితో దాదాపు గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్ లో గుజరాత్ ఓటమిని చవిచూసింది. కాగా గత మ్యాచ్ కు గాయం కారణంగా దూరమైన హార్థిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు రంగంలోకి దిగాడు. మొహాలీలోని పంజాబ్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో జీటీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇకపోతే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ ఇరు జట్లు సమఉజ్జీవులుగా ఉండడంతో ఈ మ్యాచ్ రచ్చలేపడం ఖాయం అంటున్నారు క్రీడా నిపుణులు. అయితే గుజరాత్ తో తలపడేందుకు పంజాబ్ జట్టు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కగిసో రబాడా, భానుక రాజపక్స తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక దానితో గుజరాత్ జట్టుకు పంజాబ్ బౌలింగ్ దెబ్బ ఖాయమని కొందరు క్రికెట్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి కానుందో వేచి చూడాలి.
తుది జట్లు ఇవే(IPL 2023 GT vs PBKS)
పంజాబ్ జట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ జట్టు: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్