Site icon Prime9

GT vs PBKS : పంజాబ్ ని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్.. హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్

interesting details about GT vs PBKS match in ipl 2023

interesting details about GT vs PBKS match in ipl 2023

GT vs PBKS : మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 154 పరుగుల టార్గెట్ నిలిచింది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో టైటాన్స్ చాకచక్యంగా ఆడి సక్సెస్ అందుకున్నారు.  పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఇంకో బంతి మిగిలి ఉండగానే ఛేధించింది. శుభ్‌మన్‌ గిల్ 67 పరుగులు 49 బంతుల్లో అర్ధ శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్‌తో మొత్తం మూడు విజయాలు సాధించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడం వల్ల.. పంజాబ్ ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఓపెనర్లు ప్రభ సిమ్రాన్ (0), కెప్టెన్ శిఖర్ ధావన్ (8) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. మాథ్యూ షార్ట్ 36 పరుగులు 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌ రాణించి జట్టులో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. జితేశ్‌ శర్మ 25 పరుగులు 23 బంతుల్లో 5 ఫోర్లు , సామ్‌ కరన్‌ 22 పరుగులు, చివర్లో షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22) కాస్త మెరుపులు మెరిపించడంతో.. పంజాబ్ జట్టు 150 పరుగుల మైలురాయిని చేరుకోగలిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ రెండు, షమీ, జాషువా, జోసెఫ్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.

గుజరాత్‌ టైటాన్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. శుభమన్ గిల్ మరోసారి విలువైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. గిల్ (49 బంతుల్లో 67, 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ శతకంతో రాణించగా.. సాహా (30) మెరుపులు మెరిపించడంతో పాటు.. సాయి సుదర్శన్‌ 19 పరుగులు 20 బంతుల్లో 2 ఫోర్లు. డేవిడ్ మిల్లర్ 17 పరుగులు , రాహుల్ తెవాతియా 5 పరుగులు , హార్దిక్ పాండ్య 8 పరుగులు చేయడంతో గుజరాత్ ఈ మ్యాచ్‌ని కైవసం చేసుకోగలిగింది. గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో ఏడు   పరుగులు  అవసరం కాగా.. ఫస్ట్ బాల్ కు మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో బాల్ గిల్ బౌల్డ్ అయ్యాడు. మూడో బాల్ కు ఒక్క పరుగే వచ్చింది.   ఐదో బంతికి   రాహుల్ తెవాటియా (5 నాటౌట్, 1 ఫోర్)  బౌండరీ కొట్టి గుజరాత్ విజయాన్ని ఖాయం చేశాడు. పంజాబ్ బౌలర్లు మిడిల్ ఓవర్స్ లో గుజరాత్ బ్యాటర్లను కాస్త కట్టడి చేసినా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. గత మ్యాచ్‌లో కోల్‌‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఊహించని విధంగా ఓడిపోయిన గుజరాత్ టీమ్.. తాజా విజయంతో మళ్లీ లైన్‌లో పడింది. సీజన్‌లో నాలుగో మ్యాచ్ ఆడిన గుజరాత్‌కి ఇది మూడో గెలుపుకాగా.. పంజాబ్‌కి వరుసగా రెండో ఓటమి.

Exit mobile version