Site icon Prime9

Kohli vs Gambhir : మరోసారి కోహ్లీ – గంభీర్ గొడవ.. గ్రౌండ్ లోనే మాటల యుద్ధం.. సీరియస్ అయిన బీసీసీఐ

interesting details about fight between kohli and gambhir

interesting details about fight between kohli and gambhir

Kohli vs Gambhir : భారత్‌ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అత్యుత్తమ ఆటగాళ్లుగా మంచి పేరు పొందారు. అయితే వీరిద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే. అయితే నిన్నటితో ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరింది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గత నెలలో బెంగళూరు జట్టును దాని సొంతగడ్డపై లక్నో జట్టు ఓడించింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టును బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో ఓడించింది. గత మ్యాచ్‌లో లక్నో విజయం తరువాత గంభీర్ మైదానంలోకి వచ్చి అభిమానుల వైపు చూస్తూ నోటికి వేలు అడ్డుపెట్టి సంజ్ఞ చేశాడు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా క్యాచ్ అందుకున్న కోహ్లీ గంభీర్‌లా చేయకూడదని సూచిస్తూ ముద్దు పెడుతున్నట్లు సంజ్ఞ చేశాడు. ఈ విషయంలో మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. అంతేకాక.. లక్నో టీం సభ్యుడు అమిత్ మిశ్రా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనూ విరాట్ అతనితో కూడా వాగ్వావాదానికి దిగడం కనిపించింది. దీంతో అంపైర్లు వచ్చి వారిని శాంతింపజేశారు. ఈ విషయంలోనూ గంభీర్ – కోహ్లీ మధ్య గొడవకి కారణం అని చెబుతున్నారు. 

మ్యాచ్‌ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీసారు. అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా.. కేఎల్ రాహుల్ గంభీర్‌ను పక్కకు తీసుకెళ్లాడు. వీరి గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడే కాదు.. ఐపీ‌ఎల్ 2013 సీజన్‌లోనూ కోహ్లీ, గంభీర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పడు గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, ఈసారి లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ గా కోహ్లీ ఉన్నాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా ఒకరినొకరు కరచాలనం చేసుకున్నారు. ఈ క్రమంలో గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్తూ కొట్టుకొనేంత పనిచేశారు. వీరి మధ్య వాగ్వివాదం తీవ్రరూపం దాల్చే క్రమంలో ఇరుజట్ల సభ్యులు వారిని పక్కకు తీసుకెళ్లారు. దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పుడే కాదు.. ఐపీ‌ఎల్ 2013 సీజన్‌లోనూ కోహ్లీ, గంభీర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పడు గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, ఈసారి లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.

 

అదే విధంగా లక్నో ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌లో పేసర్‌ నవీన్‌ ఉల్‌-హక్‌, కోహ్లీ మధ్య చిన్న పాటి వార్ జరిగింది. అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో గొడువ సద్దుమణిగింది. అయితే అది అక్కడతో ఆగలేదు. మ్యాచ్‌ అనంతరం షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చే సమయంలో మళ్లీ నవీన్‌ ఉల్‌-హక్‌, కోహ్లి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఇక గొడవ అంతా సద్దుమణిగాక విరాట్‌ కోహ్లీ, లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బౌండరీ లైన్‌ వద్ద నిల్చుని మాట్లాడుతున్నారు. దీంతో అటుగా వచ్చిన నవీన్‌ ఉల్‌-హక్‌ను కోహ్లీకి క్షమాపణ చెప్పమని రాహుల్‌ అడిగాడు. అయితే నవీన్‌ మాత్రం నేనేందుకు క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక నవీన్‌ ఉల్‌-హక్‌ ప్రవర్తనపై విరాట్‌ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గేమ్ లో ఇలాంటివి కామన్.. దాన్ని సీరియస్ గా తీసుకుని సారీ చెప్పకపోవడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత తలపొగరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ గా కోహ్లీ ఉన్నాడు. అసలు ఈ ఫైట్ మొత్తానికి కారణమైన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ వుల్ హక్‌కి 50 శాతం మ్యాచ్ ఫీజు కోత పడనుంది. అతను రూ.1.79 లక్షలు ఫైన్ రూపంలో చెల్లించబోతున్నాడు.

 

Exit mobile version