CSK vs KKR: ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై టీం బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు చెన్నై కు దాదాపు ప్లే ఆఫ్స్‌లో బెర్తు ఖాయమైనట్టే. మరోవైపు కోల్‌కతా జట్టు ఎలానూ ప్లే ఆఫ్స్ చేరుకోవడం అసాధ్యం. ఇక ఈ మ్యాచ్‌లో ధోనీసేన గెలిస్తే ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో టాప్-2లో నిలుస్తుంది. ఇకపోతే గుజరాత్, చెన్నై మధ్య కేవలం ఒక్క పాయింట్ తేడా మాత్రమే ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టుపై చెన్నై గెలిస్తే టేబుల్ టాపర్‌గా తలైవా టీం నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం మంచి ఫామ్‌లో ఉంది.
ఫాంలో ఉన్న చెన్నై(CSK vs KKR)
పతిరాణా, చాహర్, తుషార్ దేశ్‌పాండే సహా బౌలర్లంతా మంచి టచ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లోనూ కాన్వే, రహానే, గైక్వాడ్, దూబే మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. ఈ తరుణంలో ఈ మ్యాచ్ గెలిచే అవకాశం చెన్నైజట్టుకే ఎక్కువగా ఉందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు అంచనా: రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు అంచనా: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.