DC vs RCB: ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లోతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. దానితో ఢిల్లీ టార్గెట్ 182 రన్స్ గా ఉంది. కోహ్లీ, లోమ్రోర్ ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టుకు మంచి స్కోరును ఇచ్చారు. మాక్స్ వెల్ అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరాడు. డుప్లెసిస్ 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తీశాడు.
కాగా పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా ఢిల్లీ జట్టు 6 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది.