DC vs PBKS: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే సరికి పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. అందులోనూ ప్రభ్ సిమ్రాన్ 61 బంతుల్లో 103 పరుగులు చేసి జట్టుకు ఓ డీసెంట్ స్కోర్ అందించారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ లక్ష్యం 168 రన్స్ గా ఉంది. ఢిల్లీ బౌలర్స్ ఇషాంత్ రెండు వికెట్లు తీయగా, దూబె, కుల్దీప్ యాదవ్, అక్షర్, ముఖేష్ తలో వికెట్ తీశారు.
ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ నిష్క్రమించగా పంజాబ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. మరీ పంజాబ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి వెల్లనుందా లేక పంజాబ్ కు ఢిల్లీ షాకిస్తుందా..? అన్నది మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే.