Site icon Prime9

DC vs GT : గుజరాత్ పై ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ.. హార్దిక్ పాండ్యా ఒంటరి పోరు వృథా

DC vs GT match highlights in ipl 2023

DC vs GT match highlights in ipl 2023

DC vs GT : ఐపీఎల్‌ 2023 లో భాగంగా అహ్మ‌దాబాద్‌ లోని న‌రేంద్రమోదీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం భారీ టార్గెట్ లే కాకుండా.. లో స్కోర్ మ్యాచ్ లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇవ్వడమే కాకుండా.. అంతకు ముందు మ్యాచ్ లలో తమను ఓడించిన ప్రత్యర్ధి జట్టులను ఓడించి ప్ర‌తీకారం కూయ తీర్చుకుంటున్నాయి. తాజాగా ఈ మ్యాచ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గ‌త మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ని గుజ‌రాత్‌ ఓడించింది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 131 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ని 6 వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగుల‌కే ప‌రిమితం చేసి రివేంజ్ విక్టరీ సాధించింది ఢిల్లీ జట్టు.

ఇక గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా (59 నాటౌట్‌; 53 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా అభినవ్ మనోహర్ (26; 33 బంతుల్లో 1 సిక్స్‌) ప‌ర్వాలేద‌నిపించాడు. శుభ్‌మన్ గిల్ చేసిన 6 పరుగులకు (7 బంతుల్లో, 1 ఫోర్) పరిమితం కావడం గమనార్హం. చివ‌ర్లో రాహుల్ తెవాటియా (20; 7 బంతుల్లో 3 సిక్స‌ర్లు) చెలరేగడంతో గుజ‌రాత్ విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు అయ్యాయి. అయితే.. తొలి మూడు బంతుల‌కు మూడు ప‌రుగులే ఇచ్చిన ఇషాంత్ శ‌ర్మ నాలుగో బంతికి తెవాటియాను ఔట్ చేశాడు. మిగిలిన రెండు బంతుల్లో మూడు ప‌రుగులే ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్,ఇషాంత్ శ‌ర్మ చెరో రెండు వికెట్లు తీయ‌గా నోర్జే, కుల్దీప్ యాద‌వ్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు.. టేబుల్‌లో చివర ఉన్న ఢిల్లీ చేతిలో, సొంత మైదానంలో ఓటమి చెందడం చర్చనీయాంశంగా మారింది. కేవలం 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ మొహమ్మద్ షమీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

అంత‌క‌ ముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్ లో సాల్ట్ (0), ప్రియాయ్‌ గార్గ్ (10), రిలీ రోసోవ్ (8), మనీష్‌ పాండే (1) తక్కువ స్కోర్ లకే వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. అలానే ఊహించని రీతిలో డేవిడ్ వార్నర్ (2)ను రనౌట్ అయ్యాడు. దీంతో 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలోనే ఢిల్లీ జట్టును అమాన్‌ హకీమ్ ఖాన్ (51 పరుగులు, 44 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇక హకీమ్ ఖాన్ కి తోడుగా అక్షర్ పటేల్ 27 పరుగులు (30 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌), రిపాల్ పటేల్ 23 పరుగులు (13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌) సహకారం అందించడంతో ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోరు దక్కింది. గుజరాత్ బౌలర్లలో షమి 4 వికెట్లు, మోహిత్ శర్మ 2 వికెట్లు, రషీద్‌ ఖాన్ ఒక వికెట్ తీశారు.

Exit mobile version