Site icon Prime9

CSK vs SRH : చేతులెత్తేసిన సన్ రైజర్స్.. ఈజీ విక్టరీ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

CSK vs SRH match highlights in ipl 2023

CSK vs SRH match highlights in ipl 2023

CSK vs SRH : ఐపీఎల్ 2023 లో భాగంగా చెన్నై లోని చిదంబరం స్టేడియం వేదిక‌గా జరిగిన హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ ఇచ్చిన 135 ప‌రుగుల టార్గెట్ ని చెన్నై మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లోనే సునాయాసంగా చేధించింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ డేవాన్ కాన్వే (77 నాటౌట్‌; 57 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్‌ (35; 30 బంతుల్లో 2 ఫోర్లు) తో రాణించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరో మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది నాలుగో గెలుపు కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి ఇది నాలుగో ఓటమి. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో మ‌యాంక్ మార్కండే రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెపాక్‌లో చెన్నైపై హైదరాబాద్ టీమ్ గెలవలేదు.. దీంతో మరోసారి హిస్టరీ రిపీట్ అయ్యిందని చెన్నై ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం చెన్నై జట్టు.. రాజస్తాన్, లక్నోతో పాటు ఆరు పాయింట్లు సాధించినా నెట్ రన్ రేట్ కారణంగా మూడో స్థానంలో ఉంది.

135 పరుగుల లక్ష్య ఛేదనను చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే తొలి వికెట్ కు 11 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. వీరి జోడీ మంచి బ్యాటింగ్ తో ఆరు ఓవర్ల లోనే చెన్నై 60 పరుగులు చేసింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన 11వ ఓవర్లో చివరి బంతికి కాన్వే.. స్ట్రైయిట్ డ్రైవ్ ఆడాడు. బంతిని ఉమ్రాన్ అడ్డుకునే యత్నించాడు. కానీ బాల్ మిస్ అయింది. అయితే అప్పటికే రుతురాజ్ అప్పటికే క్రీజు దాటండంతో బెయిల్స్ కిందపడ్డాయి. ఈ వికెట్ తో వీరి పార్ట్ నర్ షిప్ బ్రేక్ అయ్యింది. గైక్వాడ్ ఔట్ అయ్యాక రహానే (9) ను కూడా తక్కువ పరుగులకే మార్కండే పెవిలియన్ కు పంపాడు. 17వ ఓవర్లో రాయుడు (9) కూడా బౌల్డ్ అయ్యాడు. ఇక చివర్లో కాన్వే వరుసగా మూడు బౌండరీలు బాది చెన్నై విజయాన్ని ఖరారు చేశాడు.

అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. సన్ రైజర్స్ లో అభిషేక్ శర్మ (34: 26 బంతుల్లో 3×4, 1×6)  పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడంటే అర్ధం చేసుకోవచ్చు. అన్ రైజర్స్ పేలవ బ్యాటింగ్ ఏ స్థితికి చేరిందో అని. మరో ఓపెనర్ హారీ బ్రూక్ (18) , నెం.3లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (21), ఆ తర్వాత కెప్టెన్ మర్‌క్రమ్ (12), క్లాసెన్ (17), మయాంక్ అగర్వాల్ (2), వాషింగ్టన్ సుందర్ (9) వరుసగా చేతులెత్తేశారు. కానీ.. ఆఖర్లో బౌలర్ మార్కో జాన్‌సెన్ (17 నాటౌట్: 22 బంతుల్లో 1×4) క్రీజులో నిలవడంతో ఈ మాత్రం స్కోరైనా వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, అకాశ్ సింగ్, థీక్షణ, పతిరన ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఐపీఎల్-16 లో కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్లతో ఆడుతున్నా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్కోసారి పేలవ ప్రదర్శన ఇస్తుంది. ఈ సీజన్ లో ఫస్ట్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడి తర్వాత.. వరుసగా రెండు విజయాలు అందుకున్న సన్ రైజర్స్.. తర్వాత మళ్లీ ఓటముల బాట పట్టింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఆడిన ఆరు మ్యాచ్ లలో రెండు గెలిచి నాలుగు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.

Exit mobile version