CSK vs LSG: లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో లక్నో జెయింట్స్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను రద్దు చేశారు. మొదటి ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే వర్షం పడుతుండడంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది. కొంత సేపటికి వర్షం తగ్గినప్పటికి మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇలాంటి సమయంలో సాధారణంగా డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగిస్తారు కానీ ఈ మ్యాచ్ కు ఈ పద్ధతిని కూడా ఉపయోగించి విజేతను నిర్ణయించే అవకాశం లేకపోయింది. నిబంధనల ప్రకారం రెండు జట్లు కనీసం ఐదు ఓవర్లు అయినా ఆడితేనే డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగించే అవకాశం ఉంది. కానీ ఈ మ్యాచ్ లో చెన్నై కనీసం ఒక్క బంతి కూడా ఆడలేదు. దానితో ఈ మ్యాచ్ ను క్యాన్సిల్ చేసి రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.