Site icon Prime9

CSK vs GT Final Match : ఐపీఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్న చెన్నై, గుజరాత్ టీమ్స్.. వరుణుడు కరుణిస్తాడా ?

CSK vs GT Final Match in ipl 2023 on may 29 2023

CSK vs GT Final Match in ipl 2023 on may 29 2023

CSK vs GT Final Match : ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యింది. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి వర్షం కారణంగా మ్యాచ్ ను  నిర్వహించలేకపోయారు. అయితే ఐపీఎల్ ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంచడం క్రికెట్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. దీంతో ఈరోజు (సోమవారం, మే 29 ) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈరోజు కూడా అహ్మదాబాద్‌లో వర్షం కురిసి మ్యాచ్ జరగకపోతే ఏమవుతుంది అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఆ ప్రశ్నలకు సమాధానం మీకోసం..

వరుణుడు కరుణిస్తాడా..?

అహ్మదాబాద్‌లో గత కొన్ని రోజులుగా అకాల వర్షం కురుస్తోంది. గత శుక్రవారం కూడా ముంబయి, గుజరాత్ టీమ్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2కి అంతరాయం కలిగించింది. కానీ.. ఆ మ్యాచ్‌లో కేవలం అరగంట మాత్రమే మ్యాచ్ టైమ్ వేస్ట్ అయ్యింది. అయితే ఆదివారం పూర్తిగా మ్యాచ్ సమయాన్ని వర్షం తుడిచిపెట్టేసింది. కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దాంతో రెండు జట్లలోనూ టెన్షన్ మొదలైంది.

(CSK vs GT Final Match) విజేతను ఎలా నిర్ణయిస్తారంటే..  

ఈరోజు కూడా వర్షం వల్ల ఆట ఆడలేకపోతే లీగ్ దశ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది. ఈ విధంగా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 ఛాంపియన్ అవుతుంది అని అంటున్నారు. లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ 14 మ్యాచుల్లో.. 10 లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు చెరో పాయింట్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

Exit mobile version