Site icon Prime9

Arjun Tendulkar: ఎట్టకేలకు ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన సచిన్ టెండూల్కర్ కుమారుడు

Arjun Tendulkar

Arjun Tendulkar

Arjun Tendulkar: వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య పోరు జరుగుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి అనంతరం దిల్లీపై గెలిచి ఉత్సాహం మీద ఉన్న ముంబై ఉంది. కోల్‌కతా గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏంటంటే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. ముంబై జట్టు తరఫున ఐపీఎల్ లో అడుగు పెట్టాడు. ఈ మ్యాచ్ లో అర్జున్ కు తొలి ఓవర్‌ బౌలింగ్‌ వేసే అవకాశం ఇచ్చారు.

 

రోహిత్ చేతుల మీదుగా క్యాప్(Arjun Tendulkar)

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ ను 2021 లోనే బేసే ఫ్రైస్ కు కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుంచి తుది జట్టులో అవకాశం రాలేదు. గత ఏడాది జరిగిన మినీ వేలంలో అర్జున్ ను ముంబై మళ్లీ కొనుగోలు చేసింది. ఎట్టకేలకు ఐపీఎల్ 16 సీజన్ లో ఆడేందుకు అర్జున్ కు అవకాశం వచ్చింది. అంతకు ముందు రోహిత్ శర్మ చేతుల మీదుగా ముంబై ఇండియన్స్ క్యాప్ ను అర్జున్ అందుకున్నాడు.

ఆల్ రౌండర్ అయిన అర్జున్ గత ఏడాది దేశవాళీ క్రికెట్ లో గోవా జట్టు తరపున రంజీల్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 7 లిస్ట్ ఏ మ్యాచులు, 9 టీ20 లు ఆడాడు. ఇపుడు కోల్ కతా మ్యాచ్ తో ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.

 

 

వెంకటేష్ అయ్యర్ దూకుడు

మ్యాచ్ విషయానికి వస్తే.. కోల్ కతా ఆటగాడు వెంకటేష్ అయ్యర్ దూకుడుగా ఆడుతున్నాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నా.. అయ్యర్ మాత్రం జోరు కొనసాగిస్తున్నాడు. అవకాశం ఉన్నపుడల్లా సిక్స్ లు, ఫోర్లు బాదుతూ ముంబై బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 23 బంతుల్లోనే హాప్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 104/3. వెంకటేశ్ అయ్యర్ (76) మీద కొనసాగుతున్నాడు.

Exit mobile version