IPL 2023 LSG vs PBSK: ఐపీఎల్ సీజన్ 16 లో మరో ఆస్తికర పోరుకు రంగం సిద్ధమైంది. డబుల్ బొనొంజా లో భాగంగా రెండో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరుగుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు రెగ్యులర్ సారధి శిఖర్ ధావన్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ స్టాండిన్ కెఫ్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
లక్నో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా .. మూడింట్లో విజయం సాధించింది. ఐపీఎల్ 16 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. మరో వైపు పంజాబ్ కింగ్స్ కూడా నాలుగు మ్యాచ్ ఆడింది. వరుసగా సన్ రైజర్స్, గుజరాత్ చేతిలో ఓటమి పాలైన పంజాబ్ ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని చూస్తోంది. కాగా పాయింట్ల పట్టికలో ఆరో ప్లేసులో ఉంది.
.@PunjabKingsIPL wins the toss, and they opt to bowl first 🏏
Watch #LSGvPBKS on #JioCinema – LIVE & FREE for all telecom operators!#IPLonJioCinema #IPL2023 #TATAIPL | @LucknowIPL pic.twitter.com/6T4f2EX5Dq
— JioCinema (@JioCinema) April 15, 2023
ఇరు జట్ల వివరాలు(IPL 2023 LSG vs PBSK)
పంజాబ్ : అథర్వా టైడే మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా, సామ్ కరన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
సబ్ స్టిట్యూట్లు: ప్రభుసిమ్రాన్, నాథన్ ఎలిస్, మోహిత్ రథీ, రిషి ధావన్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, అవేష్ ఖాన్, యుధ్ వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
సబ్ స్టిట్యూట్లు: అమిత్ మిశ్రా, జయ్ దేవ్ ఉనద్కత్, కే. గౌతమ్, ప్రేరక్ మన్కడ్చ, డేనియల్ శామ్స్