Site icon Prime9

IPL 2023 CSK vs RR: తొలి కెఫ్టెన్ గా ధోని అరుదైన రికార్డు

IPL 2023 CSK vs RR

IPL 2023 CSK vs RR

IPL 2023 CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టుకు 200 మ్యాచుల్లో నాయకత్వం వహించిన మొదటి కెఫ్టెన్ గా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2023 లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ ధోనికి 200 వ మ్యాచ్. ఓవరాల్ గా ధోని ఐపీఎల్ టోర్నమెంట్ లో మొత్తం 213 మ్యాచులకు కెఫ్టెన్ గా ఉన్నాడు. అందులో పుణె సూపర్ జెయింట్స్ కు 13 మ్యాచుల్లో సారధిగా వ్యహరించాడు. ఆ సమయంలో చెన్నై జట్టుపై రెండేళ్ల నిషేధం అమలులో ఉంది.

కాగా, చెన్నై జట్టుకు 200 మ్యాచ్ ల్లో సారధిగా ఉన్న మిస్టర్ కూల్.. అతడి కెఫ్టెన్సీ లో సీఎస్కే 121 మ్యాచుల్లో విజయం అందుకుంది. ధోని తర్వాత ఒక ఐపీఎల్ జట్టుకు ఎక్కువగ మ్యాచుల్లో కెఫ్టెన్ గా ఉన్న రికార్డు రోహిత్ శర్మ పేరుతో ఉంది. రోహిత్ ముంబై ఇండియన్స్ తరపున 146 మ్యాచులకు నాయకత్వం వహించాడు.

సీఎస్కే కెఫ్టెన్ గా ధోని 200 మ్యాచ్ సందర్భంగా.. చెన్నై ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్ ధోనిని సత్కరించారు. మరోవైపు అత్యధిక ఐపీఎల్ మ్యాచులు ఆడిన క్రికెటర్ల లిస్ట్ లో ధోని 238 మ్యాచ్ లతో టాప్ లో ఉన్నాడు.

 

ధోని మెరిసినా..(IPL 2023 CSK vs RR)

చెపాక్ స్టేడియంలో సంజూ సేన అద్భుతం చేసింది. సీఎస్కే చేతుల్లోకి వెళ్లిన మ్యాచ్ ను ఆఖరి బంతి వరకు ఊరించి లాగేసుకుంది. దీంతో 3 పరుగులతో ధోని సేనపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు నమోదు చేసుకుంది. మొదట టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

జోస్ బట్లర్ అర్ధ సెంచరీ చేయగా.. దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 38, అశ్విన్ 22 బంతుల్లో 22, హిట్ మైర్ 18 బంతుల్లో 30( 18 బంతుల్లో ) రాణించారు. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా , తుషార్ దేశ్ పాండే, ఆకాశ్ సింగ్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది.

38 బంతుల్లో 50 పరుగులు చేసిన డెవాన్ కాన్వే, అజింక్య రహానే 19 బంతుల్లో 31 చేసి.. కీలకదశలో అవుటయ్యారు. చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్‌), ధోని (17 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) లతో మెరిపించినా చెన్నైకు విజయం అందించలేకపోయారు.

15 ఓవర్లకు చెన్నై స్కోరు 113/6 గా ఉంది. ఆ సమయంలో సీఎస్కే గెలవాలంటే 30 బంతుల్లో 63 పరుగులు చేయాలి. జడేజా, ధోని క్రీజులో ఉన్నారు.16వ ఓవర్లో అశ్విన్‌ కు 4 పరుగులు…17వ ఓవర్లో చహల్ కు 5 పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై 18 బంతుల్లో 54 పరుగులుగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జంపా వేసిన 18వ ఓవర్లో ధోని, జడేజా 14 పరుగులు తీసుకున్నారు. 19వ ఓవర్లో హెల్డర్ నుంచి 19 పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ధోని సేన గెలుపుకు చివరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి.

చివరి ఓవర్‌ వేయడానికి వచ్చిన సందీప్‌ శర్మ తొలి రెండు బంతులను వైడ్‌ వేశాడు. ఆ తర్వాతి బంతికి పరుగు ఇవ్వలేదు. తర్వాతి రెండు బంతులు ఫుల్‌టాస్‌ వేయడంతో వాటిని ధోని భారీ సిక్స్‌లు కొట్టాడు. అపుడు చెన్నై గెలవడానికి 3 బంతుల్లో 7 పరుగులు కావాలి. అయితే సందీప్‌ శర్మ వేసిన చివరి మూడు బంతుల్లో ధోని, జడేజా మూడు పరుగులు మాత్రమే చేయడంతో చెన్నై ఓటమి అనివార్యమైంది.

 

 

చెపాక్ లో తొలి విజయం

కాగా, రాజ్ స్తాన్ రాయల్స్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇదే తొలి గెలుపు కావడం విశేషం. 2008 నుంచి వేచి చూసిన రాజస్తాన్.. సంజూ సారధ్యంలో బుధవారం నాటి విజయంతో మొదటి గెలుపును నమోదు చేసుకుంది.

Exit mobile version