Canada Open 2023 Title: భారత ఆటగాళ్లు ఇప్పుడు అన్ని క్రీడల్లోనూ తమదైన ప్రతిభ కనపరుస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో అంతే క్రేజ్ షటిల్ కూడా ఉంది. భారత షట్లర్లు అంతర్జాతీయ స్థాయిలో టైటిల్స్ గెలుస్తూ భారత పతాన్ని ఇంటర్నేషన్ స్పోర్ట్ వేదికగా రెపరెపలాడిస్తున్నారు. తాజాగా భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ సాధించాడు.
వెనుదిరిగిన సింధూ(Canada Open 2023 Title)
కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ విజేతగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్ చైనాకు చెందిన లిషి ఫెంగ్‌పైతో ముఖాముఖి తలపడిన లక్ష్య సేన్ 21-18, 22-20 తేడాతో గెలుపొందాడు. తద్వారా 2023 సంవత్సరంలో తన మొదటి డబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిట్ ను లక్ష్యసేన్ గెలుచుకున్నాడు. ఈ విక్టరీతో బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో లక్ష్య సేన్ 12వ స్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత యూఎస్ ఓపెనే టార్గెట్ గా తదుపరి మ్యాచ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు లక్ష్యసేన్. ప్రస్తుతం లక్ష్య సేన్ ప్రపంచంలో 19వ ర్యాంక్ లో ఉన్నాడు. కాగా కెనడా ఓపెన్ మహిళ విభాగంలో సెమీస్‌లో ఇండియన్ స్టార్ ప్లేయర్ సింధూ ఓటమితో వెనుదిరగగా.. లక్ష్య సేన్ మాత్రం ఫైనల్ మ్యాచ్‌లో సత్తాచాటి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
మ్యాచ్ గెలిచిన తరువాత యువ షెట్లర్ లక్ష్య సేన్ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ‘కొన్నిసార్లు కష్టతరమైన పోరాటాలు మధురమైన విజయాలకు దారితీస్తాయి. నిరీక్షణ ముగిసింది. కెనడా ఓపెన్ విజేతను అయినందుకు నేను సంతోషిస్తున్నాను’ అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. కెనడా ఓపెన్ టైటిల్ గెలుచుకోవటం పట్ల లక్ష్యసేన్ పై క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. పలువురు క్రీడాకారులు లక్ష్యసేన్ ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.