India Rank: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భారత్ మెుదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మరింత మెరుగైంది.
న్యూజిలాండ్ (New Zealand)తో జరిగే చివరి మ్యాచ్ లో విజయం సాధిస్తే.. వన్డే ర్యాంకిగ్స్ లో మనం మెుదటి స్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 113 పాయింట్లతో మెుదటి స్థానంలో నిలిచింది.
న్యూజిలాండ్ పై వరుస విజయాలతో టీమ్‌ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోతోంది. ఇక రెండు వరుస ఓటములతో కివీస్ రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. ఇంగ్లాండ్ 113 పాయింట్లతో మెుదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం కివీస్, భారత్ కూడా 113 పాయింట్లతో సంయుక్తంగా ఒకే స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా 112, పాకిస్థాన్ 106 పాయింట్లతో టాప్-5లో చోటు సంపాదించుకున్నాయి.
ఇక భారత్- కివీస్ రెండో వన్డేకు ముందు.. న్యూజిలాండ్ 115 పాయింట్లతో మెుదటి స్థానంలో ఉండేది.
భారత్ 111 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండేది. అయితే కివీస్ ఓడిపోవడం.. భారత్ విజయం సాధించడంతో ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది.
కివీస్ ఖాతాలో 2 పాయింట్లు కోత పడగా.. టీమ్‌ఇండియాకి 2 పాయింట్లు యాడ్ అయ్యాయి. దీంతో భారత్ మూడో స్థానంలోకి వచ్చింది.
భారత్ కు రెండు పాయింట్లు రావడంతో.. కివీస్ రెండో స్థానంలో చేరుకుంది.
మంగళవారం జరిగే చివరి వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధిస్తే అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌నూ భారత్ సొంతం చేసుకొంటే.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అగ్రస్థానంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కివీస్‌పై డబుల్ సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. 624 పాయింట్లతో ఏకంగా పది ర్యాంకులను దాటుకొని 26 వ స్థానానికి చేరుకున్నాడు.
రన్ మెషిల్ విరాట్ కోహ్లి.. 750 పాయింట్లతో నాలుగు స్థానానికి చేరుకున్నాడు. ఇక టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ 908 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/