T20 World Cup 2024: అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించాలని భావించిన బీసీసీఐ.. ఈ టోర్నీలో పాల్గొన టీమ్‌కు రోహిత్‌ను సారధిగా నిమమించింది. వైఎస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యను ఎంపిక చేసింది.
దినేష్ కార్తీక్ కు దక్కని చోటు..(T20 World Cup 2024)
కాగా బీసీసీఐ ప్రకటించిన భారత టీమ్‌ను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లను ఎంపిక చేసింది. రిజర్వ్డ్ ప్లేయర్లుగా శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ ఎంపిక చేసింది. టీ20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూసిన సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తిక్, బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లకు మొండి చేయి చూపించింది. మరోవైపు శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లలో భాగంగా ఉన్నారు. వారు జట్టుతో ఉంటారు కానీ జట్టులో అధికారిక సభ్యులు కాదు.