RCB vs GT: చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా వేశారు. ఇక టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ ఆర్సీబీకి కీలకం కానుంది.
కోహ్లీ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో లమ్రోర్ స్టంపౌట్ అయ్యాడు.
బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్ లో బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో డూప్లెసిస్ క్యాచ్ ఔటయ్యాడు.
పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 62 పరుగులు చేసింది.
బెంగళూరు ధాటింగా బ్యాటింగ్ చేస్తోంది. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 53 పరుగులు చేసింది.
నాలుగో ఓవర్లోను భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో కోహ్లీ వరుసగా మూడు ఫోర్లు సాధించాడు. చివరి బంతికి డూప్లెసిస్ కూడా ఫోర్ కొట్టాడు.
షమీ వేసిన మూడో ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. డూప్లేసిస్ ఈ ఓవర్లో నాలుగు ఫోర్లు సాధించాడు.
తొలి ఓవర్లో బెంగళూరు 6 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ తొలి ఓవర్ వేశాడు.