GT vs MI: ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్ చేరే రెండో జట్టుకోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఇక ఈ కీలక పోరులో.. ముంబయితో గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టబోతుంది.
ఇందులో గెలిచిన జట్టు.. మే 28న అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
కీలక పోరు..
ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్ చేరే రెండో జట్టుకోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఇక ఈ కీలక పోరులో.. ముంబయితో గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టబోతుంది.
ఇందులో గెలిచిన జట్టు.. మే 28న అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
ఇక క్వాలిఫియర్-1లో సీఎస్‌కే చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. ఎలాగైనా క్వాలిఫియర్-2లో విజయం సాధించి రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు లక్నో పై విజయంతో ముంబయి జోరుమీద ఉంది. క్వాలిఫయర్ 2 లో కూడా అదే జోరును కొనసాగించాలని ముంబయి భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో ముంబయి గెలిస్తే.. ఆరోసారి ఫైనల్ కు చేరుతుంది.
నేడు జరిగే మ్యాచ్ లో గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. దసున్ షనక స్థానంలో ఐరీష్ పేసర్ జాషువా లిటిల్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది.
అదే విధంగా దర్శన్ నల్కండే స్థానంలో యువ బ్యాటర్ సాయిసుదర్శన్‌ను తీసుకురావాలని గుజరాత్ మెనెజ్‌మెంట్ భావిస్తన్నట్లు సమాచారం. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం లక్నోపై ఆడిన టీమ్‌తో బరిలోకి దిగనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.