GT vs CSK Playoff: అంతా ధోని మాయ.. వ్యూవర్ షిప్ లో రికార్డు బ్రేక్ చేసిన జియో

ఐపీఎల్ 2023 లో సీజన్ లో తొలి ఫైనలిస్ట్ గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషచం తెలిసిందే. చెపాక్ స్టేడియంలో మొదటి క్వాలిఫయర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది.

GT vs CSK Playoff: ఐపీఎల్ 2023 లో సీజన్ లో తొలి ఫైనలిస్ట్ గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషచం తెలిసిందే. చెపాక్ స్టేడియంలో మొదటి క్వాలిఫయర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో చెన్నై, గుజరాత్ మ్యాచ్ సందర్భంగా మరో రికార్డు నమోదు అయింది. ఈ మ్యాచ్ ను జియో సినిమాలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. దీంతో వీక్షకుల సంఖ్య 2.5 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. గతంలో చెన్నై, ఆర్సీబీ మ్యాచ్ కు అత్యధికంగా 2.4 కోట్ల వ్యూవర్ షిప్ వచ్చింది. ఈ విషయాన్ని జియో తన ట్విటర్ లో పోస్ట్ చేసింది. ‘అతి ముఖ్యమైన 4 మ్యాచ్ ల ఆరంభంలోనే రికార్డును బ్రేక్ చేశాం. గుజరాత్, చెన్నై మ్యాచ్ ను అభిమానులు విశేషంగా ఆదరించారు’ అని ట్వీట్ చేసింది జియో.

 

 

దాదాపు 1300 కోట్ల వీడియో వ్యూస్‌తో

కాగా, జియో సినిమా ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లు కలుపుకుని దాదాపు 1300 కోట్ల వీడియో వ్యూస్‌ను దాటింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 172/7 స్కోరు చేసింది. అనంతరం 157 పరుగులకే గుజరాత్ ఆలౌట్ గా నిలిచింది. ఛేదన సమయంలో గుజరాత్ బ్యాటర్ రషీద్ ఖాన్‌ ఉన్నంత వరకు జీటీ గేమ్ లోనే ఉంది. 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి.. దూకుడుగా మీదున్న రషీద్ ఖాన్‌ తొమ్మిదో వికెట్‌ గా అవుట్ అవ్వడంతో టైటాన్స్‌కు ఓటమి ఖరారైంది. తొలి క్వాలిఫయర్ గా ఓటమిపాలైన గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. మే 26న అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్ 2 లో లక్నో లేదా ముంబైతో గుజరాత్ ఢీకొడుతుంది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఎన్నో విశైషాలు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్‌ తొలిసారి చెన్నై చేతిలో ఓటమి చవి చూసింది. గత సీజన్‌లో రెండు సార్లు, ఇప్పుడు రెండు సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. మూడు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ ఒక్క దాంట్లో ఓటమి పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ 10 వసారి ఐపీఎల్ లో ఫైనల్ కు చేరుకుంది. మే 28న అహ్యదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

 

 

 

ఫైనల్ లో చెన్నై తోనే ఢీ

మ్యాచ్ అనంతరం హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ.. మళ్లీ ఫైనల్ లో చెన్నై తోనే ఢీకొట్టాలని భావిస్తున్నట్టు తెలిపాడు. తమ ప్లాన్స్ ను సరిగానే అమలు చేశామని.. తొలుల బౌలింగ్ లో అంతగా రాణంచలేకపోయామన్నాడు. ఈ సందర్భంగా ధోని ప్లాన్ పై హార్థిక్ మరో సారి ప్రశంసలు కురిపించాడు. తన మాస్టర్ మైండ్ తో బౌలర్లను పదే పదే మారుస్తూ.. గుజరాత్ వరుస వికెట్లు కోల్పోయేలా చేశాడని తెలిపాడు. ఈ క్రెడిట్ అంతా ధోనికే దక్కుతుందన్నాడు. ఈ మ్యాచ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని.. రెండు రోజుల తర్వాత మళ్లీ క్వాలిఫయర్ 2 లో ఆడబోతున్నామని.. ఫైనల్ చేరేందుకు ఇదే మంచి అవకాశమన్నాడు.