Site icon Prime9

RCB vs GT: ఆర్సీబీకి గిల్‌ స్ట్రోక్‌.. ప్లే ఆఫ్స్ కి చేరిన ముంబయి

gujarat titans

gujarat titans

RCB vs GT: ఈ సీజన్ లో మరోసారి బెంగళూరు ఆశలు అడియాశలయ్యాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో.. ఆర్సీబీ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన గిల్.. బెంగళూరు ఆశలపై నీల్లు చల్లేశాడు.

మరోసారి ఆర్సీబీ.. (RCB vs GT)

ఈ సీజన్ లో మరోసారి బెంగళూరు ఆశలు అడియాశలయ్యాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో.. ఆర్సీబీ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన గిల్.. బెంగళూరు ఆశలపై నీల్లు చల్లేశాడు.

ప్రతి సీజన్ లో ఐపీఎల్ కప్ ను ముద్దాడాలని భావించిన ఆర్సీబీకి ఈ సారి మరో భంగపాటు తప్పలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్.. బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి శతకం వృథా అయింది. కోహ్లి (101 నాటౌట్‌; 61 బంతుల్లో 13×4, 1×6) శతకంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. గిల్‌తో పాటు విజయ్‌ శంకర్‌ (53; 35 బంతుల్లో 7×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని టైటాన్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శుభ్‌మన్‌ అదుర్స్‌..

లక్ష్య ఛేదనలో గుజరాత్ అలరించింది. ఆ జట్టు ఓపెనర్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఈ సీజన్ లో వరుసగా రెండో శతకంతో టైటాన్స్‌కు విజయాన్నందించాడు.

మెుదట 5 ఓవర్లకు.. 35 పరుగులే చేసిన గుజరాత్.. ఆ తర్వాత గేర్ మార్చింది. గిల్‌ చూడచక్కని షాట్లతో అలరించగా.. విజయ్ శంకర్ జోరు కొసాగించాడు.

దీంతో గుజరాత్ 10 ఓవర్లలో 90/1తో నిలిచింది.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన గిల్‌ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

చివరి మూడు ఓవర్లలో టైటాన్స్‌ 34 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 18వ ఓవర్లో మిల్లర్‌ (6)ను సిరాజ్‌ ఔట్‌ చేసినా.. సూపర్‌ బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ గిల్‌ రెండు సిక్స్‌లు కొట్టాడు.

అదే ఊపులో 19వ ఓవర్లో అతడు మరో సిక్స్‌ కొట్టాడు. హర్షల్‌ వేసిన ఆ ఓవర్లో 11 పరుగులొచ్చాయి.

చివరి ఓవర్లో టైటాన్స్‌కు 8 పరుగులు అవసరం కాగా.. పార్నెల్‌ మొదట నోబాల్‌, ఆ తర్వాత వైడ్‌ వేశాడు.

ఆ తర్వాత సిక్స్‌ దంచిన గిల్‌ జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాటు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు.

వారెవ్వా విరాట్‌:

బెంగళూరు ఇన్నింగ్స్‌లో కోహ్లీనే హీరో. ఛాలెంజర్స్‌ అంత స్కోరు చేసిందంటే అందుకు ప్రధాన కారణం అతడి విలువైన ఇన్నింగ్సే.

జట్టు తడబడ్డా కోహ్లి కడవరకూ క్రీజులో నిలవడంతో గట్టి సవాలు గుజరాత్‌ ముందు నిలిచింది. ఆద్యంతమూ చూడముచ్చటైన షాట్లతో కనువిందు చేసిన విరాట్‌.. వరుసగా రెండో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

Exit mobile version