Expensive Bowlers: ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆట. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు ఉర్రుతలుగిస్తారు. కొన్ని సందర్భాల్లో బ్యాటర్ల ధాటికి బౌలర్లు చేతులెత్తేస్తారు. అయితే ఐపీఎల్ చరిత్రలో కొందరు బౌలర్లు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నారు. ఒకే ఓవర్ లో లేదా.. 4 ఓవర్ల స్పెల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు ఉన్నారు. మరి ఓసారి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ అంటేనే ఫోర్లు సిక్సులు. పిచ్ అనుకూలిస్తే.. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్లు నిస్సహాయులుగా మిగిలిపోతారు. అలానే కొందరు బౌలర్లు చెత్త రికార్డులను నమోదు చేశారు. ఓసారి వారేవరో చూద్దాం.
ఐపీఎల్ లో కొందరు బౌలర్లు ఒకే ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చిన వారు ఉన్నారు. అందులో ఎక్కువ పరుగులు ఇచ్చింది వీరే.
హర్షల్ పటేల్: 2021లో చెన్నైతో జరిగిన మ్యాచ్ లో హర్షల్ ఏకంగా 37 పరుగులు ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్ లో పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు బెంగళూరు తరపున ఆడుతున్నారు. ఈ ఓవర్‌లో రవీంద్ర జడేజా 36 పరుగులు చేశాడు. మరోకటి నో బాల్.
ప్రశాంత్ పరమేశ్వరన్ : 2011లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కొచ్చి టస్కర్స్ జట్టు బౌలర్ పరమేశ్వరన్ బౌలింగ్‌ను భారీ హిట్టర్ క్రిస్‌గేల్ ఊచకోత కోశాడు. దీంతో ఒకే ఓవర్లో 37 పరుగులు వచ్చాయి.
డేనియల్ సామ్స్ : ముంబయి ఇండియన్స్ బౌలర్ సామ్స్ 2022లో ఒకే ఓవర్ లో 35 పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్‌లో ప్యాట్ కమిన్స్ దంచి కొట్టాడు.
రవి బొపారా : 2010లో రవి బొపారా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో క్రిస్ గేల్ 25, మనోజ్ తివారి 2 పరుగులు చేశారు.
పర్విందర్ ఆవానా : పంజాబ్ కింగ్స్ బౌలర్.. 2014 లో ఒకే ఓవర్లో 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్ లో సురేశ్ రైనా 32 పరుగులు సాధించాడు.
యశ్ దయాల్ : ప్రస్తుత సీజన్ లో 35 పరుగులు ఇచ్చాడు. కోల్ కతా బ్యాటర్ రింకూ సింగ్ వరుసగా 5 సిక్స్‌లు బాది.. జట్టుకు విజయాన్ని అందించాడు.
అర్జున్ తెందూల్కర్ : పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు. రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఇచ్చాడు.
బాసిల్ థంపి: సన్ రైజర్స్ ఆటగాడు బాసిల్ థంపి.. 4 ఓవర్లలో ఏకంగా 70 పరుగులు ఇచ్చాడు. 2018వ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది.
యశ్ ధయాల్: 4 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చాడు. అది ఇదే ప్రస్తుతం సీజన్ కోల్ కతా పైన ఇది జరిగింది.
ఇషాంత్ శర్మ : 2013లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 4 ఓవర్ల స్పెల్‌లో 66 పరుగులు ఇచ్చాడు.
ముజ్‌బిర్ రహ్మాన్ : 2019 సీజన్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ రహ్మాన్‌ను సన్‌రైజర్స్ బ్యాటర్లు ఉతికారేశారు. ఇలా అతడు తన 4 ఓవర్ల కోటాలో 16.50 ఎకానమీతో మొత్తం 66 పరుగులు ఇచ్చేశాడు.
ఉమేశ్ యాదవ్ : దిల్లీకి ఆడిన సమయంలో ఉమేశ్ యాదవ్.. ఆర్సీబీకి తన 4 ఓవర్ల స్పెల్‌లో 65 పరుగులు సమర్పించుకున్నాడు.