MS Dhoni: ఐపీఎల్ సమరానికి సమయం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇక ఈ ఐపీఎల్ తర్వాత.. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కు రిటైర్మింట్ ప్రకటిస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే ధోని రిటైర్మెంట్ పై చాట్ జీపీటీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానం.. (MS Dhoni)
ఐపీఎల్ సమరానికి సమయం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇక ఈ ఐపీఎల్ తర్వాత.. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కు రిటైర్మింట్ ప్రకటిస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే ధోని రిటైర్మెంట్ పై చాట్ జీపీటీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ 16 తర్వాత ధోని రిటైర్మెంట్ అవుతాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ధోనీ రిటైర్మెంట్ పై చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ ని ధోనీ రిటైర్మెంట్ గురించి అడగ్గా అది ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
నా వద్ద ధోనీకి సంబంధించిన అంతర్గత సమాచారం గానీ, అతడి వ్యక్తిగత ఆలోచనలు, ప్రణాళికలు లేవు.
అందువల్ల, ధోనీ IPL 2023 తర్వాత రిటైర్ అవుతాడో లేదో నేను కచ్చితంగా అంచనా వేయలేను.
ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలా.. వద్దా అనేది.. అతడి ఫిట్‌నెస్, ఫామ్, క్రికెట్‌లో ఇంకా కొనసాగాలనే ఆసక్తి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
వీటి ఆధారంగానే అతడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం అని గమనించాలి.
వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యతల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాలి’ అని చాట్‌జీపీటీ తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
‘ధోనీ రిటైర్మెంట్ భారత క్రికెట్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
ధోనీ భారతదేశంలోని చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి. అతడి రిటైర్మెంట్ జట్టు నాయకత్వంలో శూన్యతను కలిగిస్తుంది.
ఈ అంశంలో నేను కచ్చితమైన సమాధానం ఇవ్వలేను. కానీ, ఈ సమాచారం మీరు ఓ అంచనాకు రావడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా’ అని చాట్‌జీపీటీ వెల్లడించింది.