WTC Final 2023: ఐపీఎల్ సీజన్ ముగియగానే.. క్రికెట్ ప్రేక్షకులకు మరో పండగ రానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఫైనల్.. జూన్ 7 నుంచి 11 వరకు.. ఓవల్ గ్రౌండ్ లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. భారీగా పారితోషకాన్ని అందుకోనుంది.
ఫైనల్ గెలిస్తే.. (WTC Final 2023)
ఐపీఎల్ సీజన్ ముగియగానే.. క్రికెట్ ప్రేక్షకులకు మరో పండగ రానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఫైనల్.. జూన్ 7 నుంచి 11 వరకు.. ఓవల్ గ్రౌండ్ లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. భారీగా పారితోషకాన్ని అందుకోనుంది. ఈ మ్యాచ్ లో గెలవాలని రెండు జట్లు గట్టిగా భావిస్తున్నాయి. ఇప్పటికే భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ చేరుకుని ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టారు.
ఎంత ఇస్తారో తెలుసా?
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుంది. రన్నరప్‌కు ఎంతిస్తారు అన్న విషయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలియజేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. అంటే భారత కరెన్సీలో రూ.13.24 కోట్లు అన్నమాట. అదే విధంగా రన్నరప్‌కు 8 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లు) బహుమతిగా అందనుంది.
ఇక 2019లో కూడా ఇదే ప్రైజ్ మనీ అందజేశారు. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు.
ఇక మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు(రూ. 3.6 కోట్లు), నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కు రూ. 2.8 కోట్లు,
ఐదో స్థానంలో ఉన్న శ్రీలంకకు రూ.1.6 కోట్లు దక్కనున్నాయి. ఇక ఆరు, ఏడు, ఎనిమిది,
తొమ్మిది స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు తలో 100,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.82లక్షలు అందనున్నాయి.
తొలిసారి కప్ గెలిచిన న్యూజిలాండ్..
మెుదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగింది. ఇక ఇందులో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది.
మరోసారి ఫైనల్ కి చేరిన టీమిండియా ఈసారి కచ్చితంగా ఫైనల్లో గెలవాలని భావిస్తోంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు లండన్‌కు వెళ్లారు.
రన్ మిషన్ విరాట్ కోహ్లీ, నయా వాల్ పుజారా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్.
తదితర ఆటగాళ్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో ప్రాక్టీస్ ప్రారంభించారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, కేఎస్ భరత్, మహ్మద్ షమీ లు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే లండన్ విమానం ఎక్కనున్నారు.