Site icon Prime9

Dhoni Retirement: రిటైర్మెంట్ వార్తలపై బ్లాక్ బస్టర్ రిప్లై ఇచ్చిన ఎంఎస్ ధోని

Dhoni Retirement

Dhoni Retirement

Dhoni Retirement: భారత స్టార్ క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజనే చివరది అంటూ ప్రతి లీగ్ కు ముందు వార్తలు రావడం జరుగుతోంది. ధోని రిటైర్మెంట్ పై వివిధ రకాలుగా పలువరు స్పందించడం చూస్తూనే ఉన్నాం. అయితే రిటైర్మెంట్ పై ధోని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ధోని తన రిటైర్మెంట్ వార్తలపై రియాక్ట్ అయ్యాడు.

 

రిటైర్మెంట్ వార్తలపై రియాక్షన్(Dhoni Retirement)

లక్నోతో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతుండగా కామెంటేటర్ ‘మీ చివరి సీజన్‌ను ఆస్వాదిస్తున్నారా?’ అని ధోనీని అడిగాడు. ఆ ప్రశ్నకు చెన్నై సారథి స్పందించాడు. ‘ఇది నా చివరి ఐపీఎల్‌ అంటూ మీరు నిర్ణయించుకున్నారు.. కానీ నేను కాదు’ అంటూ నవ్వుతూ తనదైన స్టయిల్ లో సమాధానమిచ్చాడు. అనంతరం సదరు కామెంటేటర్‌.. స్టేడియంలో ధోనీ కోసం వచ్చిన ఫ్యాన్స్ ను చూపిస్తూ.. ‘మహీ వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా ఆడేందుకు వస్తాడు’ అని తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో ధోనీ అభిమానులు ఫుల్ ఖుషీ అయి.. అరుపులు కేకలతో తమ మద్దతు తెలిపారు.

 

 

ఈడెన్‌గార్డెన్స్‌ లో సరదా కామెంట్స్ తోెనే

ఇటీవల ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ తన ఫేర్‌వెల్‌పై సరదా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా సొంత మైదానం అయినప్పటికీ.. అభిమానులు ఎంఎస్ ధోనీకి, సీఎస్‌కేకు మద్దతుగా నిలిచారు. దీంతో మ్యాచ్‌ అనంతరం ధోనీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు వీరంతా సీఎస్‌కే జెర్సీలో వచ్చినట్లుందని నవ్వుతూ కామెంట్ చేశాడు. దీంతో అప్పటి నుంచి ధోని రిటైర్ మెంట్ పై వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. నేడు లక్నోపై నెగ్గితే 12 పాయింట్లతో రెండో స్థానంలోకి చేరుకునే అవకాశం ఉంది.

 

Exit mobile version
Skip to toolbar