Site icon Prime9

MS Dhoni: అభిమాని బైక్ ను తన టీ-షర్ట్‌తో శుభ్రం చేసి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ధోని

MS Dhoni

MS Dhoni

MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన దైన సింప్లిసిటీతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. విషయానికి వస్తే ఓ అభిమాని తన మోటార్ బైక్ పై ధోని ఆటోగ్రాఫ్ అడిగాడు. దీనితో ధోని తన అభిమాని ట్రయంఫ్ రాకెట్ 3R మోటార్‌సైకిల్‌నుముందు తన స్వంత టీ-షర్ట్‌తో శుభ్రం చేసి సంతకం పెట్టాడు. అతను తాను ఆటోగ్రాఫ్ ఇచ్చేముందు బైక్ ముందు భాగాన్ని శుబ్రం చేయడం అందరినీ ఆకట్టుకుంది.అతని ఉత్సాహం మరియు వినయ స్వభావం పూర్తిగా కనపడుతున్నాయని నెటిజన్లు అం టున్నారు.

రెండు రోజుల్లో 15 మిలియన్ల వ్యూస్..(MS Dhoni)

సుమీత్ కుమార్ బజాజ్ పోస్ట్ చేసిన వీడియోలో ధోని తరువాత బైక్ పై కూర్చుని స్టార్ట్ చేయడం కనిపిస్తోంది. సౌండ్‌కి అతని ముఖం ఆనందంతో వెలిగిపోతున్నట్లు కూడా చిత్రీకరించబడింది. ఈ వీడియో కేవలం రెండు రోజుల్లోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.అభిమానులు ధోని యొక్క డౌన్-టు-ఎర్త్ ప్రవర్తన మరియు మోటార్ సైకిళ్ల పట్ల అభిరుచికి ప్రశంసలతో కామెంట్స్ విభాగాన్ని నింపారు.అతను తన టీ-షర్టుతో బైక్ ముందు భాగాన్ని రెండుసార్లు తుడిచిపెట్టాడు. ప్రజలు కొత్త వస్తువులను ఎలా చూసుకుంటారనేది అతనికి బాగా తెలుసు అని ఒక నెజటిన్ రాశారు.అతని ముఖంలో ఆ చిరునవ్వు.. కేవలం ధోనీకి మాత్రమే సాధ్యం.. జస్ట్ ధోనీ… ఒక మోటార్ సైకిల్ మాత్రమే ఆ చిరునవ్వును తీసుకురాగలదు” అని మరొక నెటిజన్ రాశారు.ధోని ప్రవర్తన నా హృదయాన్ని కదిలించిందని మరొక నెటిజన్ రాసారు.

Exit mobile version