GT vs DC: బౌలింగ్ లో షమీ చెలరేగడంతో దిల్లీ తక్కువ పరుగులకే పరిమితమైంది. ఓ దశలో 25 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది దిల్లీ. ఈ క్రమంలో అమాన్ ఖాన్, అక్షర్ పటేల్ రాణించడంతో దిల్లీ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అమాన్ ఖాన్ 51 పరుగులు.. అక్షర్ 27 పరుగులతో రాణించారు. చివర్లో రిపాల్ పటేల్ చెలరేగాడు.
గుజరాత్ బౌలింగ్ లో షమీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మోహిత్ శర్మ రెండు వికెట్లు.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.