Site icon Prime9

DC vs KKR : ఐపీఎల్ లో ఎట్టకేలకు విజయం సాధించిన ఢిల్లీ.. కోల్‌క‌తా పై చెలరేగిన వార్నర్

DC vs KKR match highlights in ipl 2023

DC vs KKR match highlights in ipl 2023

DC vs KKR : ఐపీఎల్ 2023 లో ఎట్ట‌కేల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక విజ‌యం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ గెలుపొందింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీకి ఇదే మొదటి విజయం కావడం గమనార్హం. అలానే కోల్‌కతాకి ఇది నాలుగో ఓటమి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కోల్‌క‌తా నిర్దేశించిన 128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా (13) మళ్లీ ఫెయిలవగా మిచెల్ మార్ష్ (2) పేలవ ఫామ్‌ని వీడలేదు. డేవిడ్ వార్న‌ర్ (57; 41 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వరుసగా వికెట్లు పడుతున్నా డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. కోల్‌క‌తా ను తక్కువ స్కోర్ కే పరిమితం చేయడంతో మ్యాచ్ ని హైదరాబాద్ ఈజీగా గెలుస్తుంది అని అంతా  భావించారు. కానీ వార్న‌ర్ ఔట్ కావ‌డంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అలానే మిడిల్ ఓవర్లలో మనీశ్ పాండే (21: 23 బంతుల్లో 2×4).. చివర్లో అక్షర్ పటేల్ (19 నాటౌట్: 22 బంతుల్లో 1×4), లలిత్ యాదవ్ (4 నాటౌట్: 7 బంతుల్లో) రాణించ‌డంతో వార్నర్ సేన గెలుగు బాట పట్టింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అనుకుల్ రాయ్, నితీశ్ రాణాలు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అంత‌క‌ముందు వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్యంగా వేశారు. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్ లో చేతులెత్తేశారు. ఢిల్లీ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో 15 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా తొలి వికెట్‌ను కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన లిట‌న్ దాస్‌ను ముకేశ్ కుమార్ ఔట్ చేశాడు. జేస‌న్ రాయ్‌(43; 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్ర‌య‌త్నం చేసినా అత‌డికి స‌హ‌క‌రించే వారు క‌రువు అయ్యారు.

వరుసగా వికెట్లు పడుతున్నా జేసన్ టీమ్ కి అండగా నిలబడ్డాడు. దాంతో 15వ ఓవర్ వరకూ జేసన్ రాయ్..  ఆఖ‌ర్లో ఆండ్రూ ర‌స్సెల్ రాణించడంతో కనీసం స్కోర్ అయినా చేయగలిగింది. ర‌స్సెల్‌(38 నాటౌట్‌; 31 బంతుల్లో 1ఫోర్, 4సిక్స‌ర్లు) రాణించ‌డంతో కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ముఖ్యంగా చివరి ఓవర్‌లో రసెల్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టడంతో ఈ మాత్రం స్కోరైనా నమోదైంది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఇషాంత్ శ‌ర్మ, అన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ త‌లా రెండు వికెట్లు తీయ‌గా, ముకేశ్ కుమార్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఈ మ్యాచ్ తో టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఐపీఎల్‌-2023లో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. సుమారు 717 రోజుల తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ఢిల్లీ పేసర్‌ సూపర్‌ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఇషాంత్‌ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు.

 

Exit mobile version