Site icon Prime9

IND vs NZ: భారత్ న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్

IND vs NZ second t20i

IND vs NZ second t20i

IND vs NZ: భారత్–న్యూజిలాండ్‌ మధ్య వెల్లింగ్టన్‌లో తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల టాస్‌ కూడా పడకుండానే రద్దయిన సంగతి తెలిసిందే. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కాస్త రెండు టీ20ల పోరుగా కుదించబడింది. అయితే ఇప్పుడు మౌంట్‌ మాంగనుయ్ కి వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది.

అయితే ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే రెండో టీ20కి కూడా వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దాంతో, ఈ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇకపోతే హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని భారత్ తరఫున ఈ సిరీస్ లో పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించాలని చూస్తోంది. శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ కివీస్‌ గడ్డపై తమ సత్తాచాటాలని ఎదురుచూస్తున్నారు.
భారత్ మాదిరిగా న్యూజిలాండ్ కూడా టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌ ఓటమి బాధను మరిచి ఈ మ్యాచ్ ల ద్వారా తిరిగి గాడిలో పడాలని ఆశిస్తోంది. మరి, వరుణ దేవుడు కరుణిస్తాడో లేదో ఈ మ్యాచ్‌ సాఫీగా సాగుతుందో లేదో చూడాలి.

ఇదీ చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా సెలెక్షన్ కమిటీపై వేటు

Exit mobile version