Site icon Prime9

కుల్దీప్ యాదవ్: బంగ్లాదేశ్‌తో ఫస్ట్ టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు రెండో టెస్టుకు జట్టులో చోటు లేదు ఎందుకు?

why kuldeep yadav not getting place in second test series against Bangladesh

why kuldeep yadav not getting place in second test series against Bangladesh

Kuldeep Yadav: చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో భారత్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. కాగా ఈ మ్యాచ్ గెలుపుకు కుల్దీప్ యాదవ్ కీలక కారణమని చెప్పవచ్చు. అయితే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించగానే చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు.

గత మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్న స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌ను రెండో టెస్ట్ ఫైనల్‌ ఎలెవన్‌ నుంచి తొలగించింది టీమిండియా. కాగా అతని స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌కు టీంలో చోటుకల్పించారు. దానితో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఈ నిర్ణయంపై ఆశ్చర్యానికి లోనయ్యారు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ఉనాద్కత్‌ సుమారు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ ధరించడం ఒక సంతోషదాయకమైన విషయమే అయినా కుల్దీప్ యాదవ్ ను అకస్మాత్తుగా టీం నుంచి తొలగించడం పట్ల టీమిండియా కెప్టెన్ మరియు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్ హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

కుల్దీప్ ను వదిలివేయడం దురదృష్టకరం..

తొలి టెస్ట్ మ్యాచ్‌లో కుల్దీప్ ఎనిమిది వికెట్లు పడగొట్టి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
“మేము ఒక మార్పు చేసాము – కుల్దీప్ ప్లేస్ లో ఉనద్కత్ వచ్చాడు. కుల్దీప్ ను వదిలివేయడం మాకు దురదృష్టకర నిర్ణయం,
కానీ ఇది ఉనద్కత్‌కు ఒక అవకాశం” అని టాస్ సందర్భంగా కెప్టెన్ రాహుల్ చెప్పారు.

ఇలా జరగడం రెండో సారి..

2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ తన టెస్టు అరంగేట్రం చేసాడు, అయితే కొంతకాలం పాటు భారత టెస్ట్ జట్టుకు దూరమయ్యాడు. కాగా ఇటీవల మరల టీంలోకి వచ్చి తన సత్తా చాటుతుండా తాజాగా ఇలా అతన్ని తొలిగించడం పట్ల క్రికెట్ లవర్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కుల్‌దీప్‌ ఐదు వికెట్లు తీసిన తర్వాత భారత టెస్ట్ XI నుండి తప్పించడం ఇది రెండోసారి. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం, 2018/19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో ఆస్ట్రేలియాపై 5/99 తీసిన తర్వాత కుల్దీప్ మ్యాచ్ నుంచి తొలగించారు. సరిగ్గా అలాగే నిన్న మ్యాచ్ తర్వాత చేశారు. దానితో నెటిజన్లు ప్రతి రంగంలోనూ రాజకీయమా.. కుల్దీప్ ను తొలగించడం చాలా బాధాకరం అని కొందరు. షాకింగ్ డెసిషన్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

అప్పటికి కొహ్లీ ఎంట్రీ ఏ లేదు..

ఇకపోతే కుల్దీప్ స్థానంలో వచ్చిన ఉనాద్కత్ తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ అందివచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. జయదేవ్ సుమారు 12 ఏళ్ల క్రితం (16 డిసెంబర్ 2010)న తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు.
దీంతో జట్టులో చోటు కోల్పోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీమిండియాలో స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌ద్వారా కెరీర్‌లో తొలి టెస్టు వికెట్ కూడా అందుకున్నాడు ఉనద్కత్‌. కాగా జయదేవ్ ఉనద్కత్‌ తన రెండవ టెస్ట్ ఆడేందుకు సుమారు 4389 రోజుల పాటు అలాగే 118 టెస్టుల వేచి చూడాల్సి వచ్చింది.  కాగా 2010లో ఉనద్కత్‌ తన మొదటి టెస్టు ఆడినప్పుడు, విరాట్ కోహ్లీ ఇంకా తన టెస్టు అరంగేట్రం చేయలేదు. అదే సమయంలో, ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అప్పటి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి: ఫిఫా ప్రపంచకప్ లో అన్ని మ్యాచులు చూసి ప్రపంచరికార్డు సృష్టించాడు..

Exit mobile version