Site icon Prime9

Virat Kohli: విరాట్ కు వీరాభిమానం.. ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించిన కోహ్లీ

virat kohli twitter fans

virat kohli twitter fans

Virat Kohli: విరాట్ కోహ్లీ అంటే తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరు. ఈ పేరు వింటే క్రికెట్‌ లవర్స్ తమని తాము మైమరిచిపోతారు. ఇక కుర్రకారులో కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదండోయ్. సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీకి అభిమానులు కొదవలేదు. అయితే ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లీ రికార్డుకెక్కారు. మరి ఆ ఘనత ఏంటో తెలియాలంటే ఈ కథనం చదివెయ్యండి

విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ట్విట్టర్‌లో కోహ్లీని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య 5 కోట్లకు చేరుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తనకు ఎదురులేదని ఈ టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ మరోమారు నిరూపించాడు. వేర్వేరు సామాజిక మాధ్యమాలు కలుపుకుని విరాట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు 21.1 కోట్ల పైనే ఉందట.

తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో ఆఫ్గానిస్థాన్‌ పై సెంచరీ చేసి అదరగొట్టి ఐయామ్ బ్యాక్ అంటూ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ భారత దిగ్గజ క్రికెటర్. కాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ పాంటింగ్‌తో సమంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా కోహ్లీ ఘనతకెక్కాడు. కాగా త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ కోహ్లీ తనదైన స్టైల్లో మెరుపులు మెరిపించాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి: Asia Cup 2022: కొత్త రికార్డ్ సృష్టించిన కింగ్ కోహ్లీ

Exit mobile version