Site icon Prime9

ENG vs PAK: ఫైనల్ ఫైట్.. సూపర్‌ బౌలింగ్‌కు వర్సెస్ పటిష్ట బ్యాటింగ్‌

today-pakistan-will-clash-with-england t20 world cup 2022 final match

today-pakistan-will-clash-with-england t20 world cup 2022 final match

ENG vs PAK: అంచనాలకు అందకుండా నెలరోజులుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తూ కొనసాగుతున్న పొట్టి ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఊహించని ట్విస్టులతో సాగిన టీ20 ప్రపంచకప్‌ తుది పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా గ్రూప్‌ దశలోనే వెనుదిరగగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా నాకౌట్‌కే పరిమితమైంది. ఇదిలా ఉంటే ఎవరూ ఊహించని విధంగా ఇంటికి వెళ్తుందనుకున్న పాకిస్థాన్‌ మాత్రం అనూహ్యంగా టైటిల్‌ పోరులో నిలిచింది. దీనితో నేడు సూపర్‌ బౌలింగ్‌కు, పటిష్ట బ్యాటింగ్‌కు మధ్య ముఖాముఖీ పోరుకు మెల్ బోర్న్ మైదానం వేదిక కానుంది. ఇక ఈ సమరంలో పైచేయి ఎవరిదనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

టీ20 ప్రపంచకప్‌ తుది దశకు చేరింది. మాజీ ఛాంపియన్లు అయిన ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్ల ఖాతాలో ఒక్కో ప్రపంచకప్‌ (2009లో పాక్‌, 2010లో ఇంగ్లండ్‌) ఉంది. నేడు ఎవరు గెలిచినా వారి ఖాతాలో రెండో కప్‌ వచ్చి చేరినట్టవుతుంది. సెమీస్ లో ఇంగ్లండ్‌ జట్టు భారత్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగంతి తెలిసిందే. అటు పాక్‌ జట్టు కివీస్ పై తమ గెలుపొంది తమ సత్తా చాటింది. టోర్నీ ఆరంభంలో రెండు వరుస ఓటములతో పాక్‌ పని అయిపోయినట్టేనని అంతా భావించినా.. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ ఓడించడం వారికి వరంలా మారింది. దానితో ఉత్సాహంలో ఉన్న పాక్ వరుసగా బంగ్లాదేశ్‌, కివీస్ లను ఓడించి తుది పోరుకు చేరింది. ఇకపోతే రెండు జట్ల ఓపెనర్లు సెమీ‌స్ లో అద్భుతంగా రాణించారు. ఈ నేపథ్యంలో నేడు జరుగనున్న మ్యాచ్‌ అభిమానులకు కనులవిందు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో పాక్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచింది.

ఇదిలా ఉంటే మెల్‌బోర్న్‌ మైదానం పెద్దది. ఈ పిచ్‌ పేస్‌, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. క్రీజులో నిలబడగలిగితే మంచి స్కోరు సాధ్యమవుతుంది. ఇకపోతే ఈ అంతిమ సమరానికి ఈ రోజు వర్ష సూచన ఉంది. మరి వరుణుడు కరుణిస్తే ఈ రోజు జరుగనున్న పోరు మంచి ఆసక్తికరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయితే తుది పోరుకు రిజర్వ్‌ డే కూడా ఉంది.

పాకిస్థాన్‌ తుది జట్టు అంచనా:

రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), హరీస్‌, మసూద్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌, నవాజ్‌, వసీమ్‌ జూనియర్‌, షహీన్‌షా, నసీమ్‌ షా, రౌఫ్‌.

ఇంగ్లండ్‌ తుది జట్టు అంచనా:

బట్లర్‌ (కెప్టెన్‌), హేల్స్‌, సాల్ట్‌, స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, బ్రూక్‌, సామ్‌ కర్రాన్‌, క్రిస్‌ వోక్స్‌, జోర్డాన్‌, ఆదిల్‌ రషీద్‌.

ఇదీ చదవండి: టీమిండియా ఓటిమిపై “గిన్నిస్ వరల్డ్ రికార్డ్” సెటైర్స్

Exit mobile version