Site icon Prime9

Team India: పాకిస్తాన్ ను పడగొట్టి.. టీం ఇండియా ప్రపంచ రికార్డ్

team india players unhappy with food in Sidney practice match

team india players unhappy with food in Sidney practice match

Team India: ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ విజయంతో టీంఇండియా టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. గతంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టడమేకాక కొత్త రికార్డును సృష్టించింది.

హైదరాబాద్‌లో మ్యాచ్ గెలవడంతో ఈ క్యాలెండర్ ఇయర్‌లో మొత్తంగా టీంఇండియా టీ20 మ్యాచ్లలో 21మ్యాచ్లను గెలిసింది. ఈ సందర్భంగా 2021లో పాకిస్తాన్ పేరిట ఉన్న అత్యధిక విజయాల (20) రికార్డును టీం ఇండియా బద్దలుకొట్టింది. ఒకే ఏడాదిలో టీ20లలో 21 విజయాలు నమోదు చేసిన తొలి పురుషుల జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా టీ20లలో అత్యధిక విజయాలు అందుకున్న రెండో భారత కెప్టెన్ గా  రోహిత్ శర్మ నిలిచాడు. ఈ లిస్టులో ఎంఎస్ ధోని 42 విజయాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత రోహిత్ శర్మ 33 విజయాలు సాధించాడు. మూడో స్థానంలో కోహ్లీ ఖాతాలో 32 విజయాలును తన కైవసం చేసుకున్నాడు.

ఇకపోతే మహిళల క్రికెట్‌లో ఈ రికార్డు థాయ్లాండ్ ఉమెన్స్ టీమ్ పేరిట ఉంది. థాయ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు 2019లో 25 మ్యాచ్‌లు ఆడి 21 విజయాలు సాధించింది.

ఇదీ చదవండి:  కోహ్లీ , సూర్యాకుమార్ యాదవ్ ఛేజింగ్కు దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం

Exit mobile version