Site icon Prime9

T20 World Cup 2022: T20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు వెళ్లాలంటే శ్రీలంక గెలవాలి

Australia

Australia

Australia: శుక్రవారం, జరిగిన T20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు పరుగుల తేడాతో  ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. అయినప్పటికీ  ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ చేరే విషయం ఇప్పుడు వారి చేతుల్లో లేదు. ఎందుకంటే సెమీఫైనల్ కు చేరడానికి ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ నుంచి గట్టి పోటీ ఎదురయింది.

ఇంగ్లండ్ శనివారం శ్రీలంకను ఓడించినట్లయితే,  ఆస్ట్రేలియాకు ఏడు పాయింట్లు చొప్పున ముగుస్తాయి. ఆసీస్‌తో పోలిస్తే మెరుగైన నెట్ రన్ రేట్ (+0.547) ఉన్నందున ఇంగ్లండ్ సెమీఫైనల్ కు వెడుతుంది.ఒకవేళ మ్యాచ్ వాష్ అవుట్ అయితే, ఇంగ్లండ్ ఆరు పాయింట్లతో ముగుస్తుంది, ఆస్ట్రేలియా సాధించిన ఏడు పాయింట్ల కంటే ఒకటి తక్కువ. ఆసీస్ సెమీస్‌కు చేరుకుంటుంది.

ఇంగ్లండ్‌ను శ్రీలంక ఎలాగైనా ఓడించగలిగితే, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది. అలాంటప్పుడు, ఆసీస్ ఏడు పాయింట్లతో ఉంటే ఇంగ్టాండ్ ఐదు పాయింట్లను కలిగి ఉంటుంది. అంటే శనివారం మ్యాచ్ శ్రీలంక విజయం ఆస్ట్రేలియా కు చాలా ముఖ్యం.

Exit mobile version