Site icon Prime9

Surya Kumar Yadav: ఐసీసీ ర్యాంకింగ్ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 1

surya kumar yadav got icc no1 batter rank

surya kumar yadav got icc no1 batter rank

Surya Kumar Yadav: భారత క్రికెటర్లు అత్యద్భుత రికార్డులు నెలకొల్పుతు ఉంటారు. ఈ నేపథ్యంలోనే జోరుమీదున్న బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. టీమిండియా యంగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నూతన రికార్డ్ సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకున్నాడు.

ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లలో ఇటీవల సూర్యకుమార్ యాదవ్ విజృంభిస్తోన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు ఇప్పుడు టి20 WC లోనూ అద్భుతంగా రాణిస్తుండటంతో ఏకంగా 863 పాయింట్లు సాధించి నెంబర్-1 ర్యాంక్ దక్కించుకున్నాడు. మార్చి, 2021లో అరంగేట్రం చేసి అతి తక్కువ కాలంలోనే నెంబర్-1 ర్యాంకు దక్కించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఐసీసీ టీ20 బ్యాట‌ర్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ సాధించిన 23వ క్రికెట‌ర్‌గా, రెండ‌వ ఇండియ‌న్ బ్యాట‌ర్‌గా కూడా సూర్య నిలిచాడు. పాక్ ఓపెనర్ రిజ్వాన్ నెంబర్-2 కు పడిపోయాడు. మరియు ఫైర్ మ్యాన్ విరాట్ పదో ర్యాంకులో ఉన్నాడు.

ఇదీ చదవండి బ్యాటుతో విధ్వంసం.. 50 బంతుల్లో 150 పరుగులు

Exit mobile version