Site icon Prime9

ENG vs SL: టాస్ గెలిచిన శ్రీలంక.. గెలిచినా ఓడినా ఇంటికే..!

ENG vs SL t20 world cup today match

ENG vs SL t20 world cup today match

ENG vs SL: క్రికెట్ అంటేనే ఇంగ్లండ్ ఎందుకంటే క్రికెట్ అనేది ఇంగ్లండ్ దేశపు జాతీయ క్రీడ. అలాంటి ఇంగ్లండ్ జట్టుకు ఇవాళ సెమీస్ బెర్త్ కోసం తాడోపేడో తేల్చుకోవాల్సి పరిస్థితి ఎదుర్కొంటుంది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 గ్రూప్‌-1లో నేడు శ్రీలంకతో మ్యాచ్‌ ఇంగ్లండ్‌ తలపడనుంది. ఇంగ్లండ్ కు చావో రేవో తేల్చే మ్యాచ్ గా ఈ రోజు టోర్నీ మారనుంది. లంకపై గెలిస్తేనే ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరుతుంది. ఓడితే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్తుంది. ఇక ఈ రోజు మ్యాచ్లో టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఫీల్డింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా ఇంగ్లండ్‌ ఫేవరెట్‌ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నాలుగు మూడు మ్యాచ్ లు ఆడిన ఇంగ్లండ్ 2 విజయాలు, ఒక ఓటమితో ఉంది.

ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌లో తొలి స్థానం నుంచి 10వ స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సమర్థులు ఉన్నారు. బట్లర్‌, స్టోక్స్‌, అలెక్స్‌ హేల్స్‌, డేవిడ్‌ మలన్‌లతో జట్టు టాపార్డర్‌ పటిష్టంగా ఉంది.
ఇక బౌలింగ్‌లో మార్క్‌వుడ్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కరన్‌లు తమ పేస్‌ పదును చూపిస్తుండగా ఆదిల్‌ రషీద్‌ స్పిన్‌తో చెలరేగిపోతున్నాడు.

ఇకపోతే  శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్‌ గెలిచినా ఓడినా ఇంటి దారి పట్టక తప్పదు. కానీ ఈ మ్యాచ్ గెలిచి ఇంగ్లండ్‌ జట్టును తమతో పాటు ఇంటికి తీసుకుపోవాలని భావిస్తుంది. ఇటీవల కాలంలో అనుకున్న రీతిలో లంక జట్టు ఆడడం లేదు.

ఇంగ్లండ్ తుది జట్టు: జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్‌

శ్రీలంక తుది జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్‌), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత

ఇరుజట్ల రికార్డులు పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ రెండు జట్లు పోరులో 13 సార్లు ముఖాముఖి తలపడగా ఇంగ్లండ్‌ 9సార్లు, శ్రీలంక నాలుగుసార్లు నెగ్గాయి.  మరి ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరించనుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి: విరాటుకి వీర లెవెల్లో విషెష్.. తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కటౌట్స్

Exit mobile version