Site icon Prime9

Sachin Tendulkar: రోడ్ సైడ్ టీ తాగుతూ ఎంజాయ్ చేసిన సచిన్

sachin tendulkar enjoys a cup of tea at roadside stall

sachin tendulkar enjoys a cup of tea at roadside stall

Sachin Tendulkar: క్రికెట్‌ దేవుడు, భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్‌ రోడ్‌సైడ్‌ చాయ్‌ని ఎంజాయ్‌ చేస్తూ ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేశాడు. క్రికెట్ కా గాడ్ తమ చిన్న దుకాణంలో టీ తాగడానికి రావడాన్ని చూసి ఆ టీ దుకాణదారు ఎంతో మురిసిపోయాడు.

కుమారుడు అర్జున్‌తో కలిసి బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఓ చోట సచిన్ ఆగాడు. అక్కడ రోడ్డు పక్కనే ఉన్న ఓ చాయ్‌ దుకాణంలోకి వెళ్లి టీ తీసుకుని అక్కడ ఉన్న ఛాయ్ వాలాతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అది చూసిన స్థానికులు అక్కడికి చేరుకుని సచిన్ తో సెల్ఫీలు దిగడానికి ఆసక్తి కనపరిచారు. దానితో వారితో స్వీయ చిత్రాలు దిగుతూ సందడి చేశారు సచిన్. అనంతరం అక్కడ చాయ్‌తాగుతూ ఆ రుచిని ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్టు చేశారు. ‘రోడ్‌ ట్రిప్‌లో చాయ్‌ బ్రేక్‌’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇదీ చదవండి: భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను.. పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీ

Exit mobile version