Site icon Prime9

PM Modi: పాక్ పై ఇండియా విజయం.. కోహ్లీని అభినందించిన ప్రధాని

modi tweet on team india won against pak

modi tweet on team india won against pak

PM Modi: ఆదివారం నాడు దాయాదీపోరులో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. దానితో కోహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే జట్టును మరియు విరాట్ కొహ్లీని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. “భారత జట్టు బాగా పోరాడి విజయం సాధించింది. ఈ రోజు అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు అభినందనలు. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు.

విరాట్ అద్భుతమైన పట్టుదలతో జట్టును గెలిపించాడు. రాబోయే ఆటలకు శుభాకాంక్షలు” అని ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇకపోతే భారత జట్టు అద్భుతమైన విజయంపై పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు భారత మాజీ కెప్టెన్ కొహ్లీ ఆటను ప్రసంశించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత జట్టును మరియు కొహ్లీని ప్రశంసలతో ముంచెత్తారు. దీపావళి వేడుకలకు మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తూ సంబరాలకు నాంది పలికిన భారత విజయాన్ని అభినందిస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. “T20 ప్రపంచ కప్‌ను ప్రారంభించడానికి సరైన మార్గం. దీపావళి ప్రారంభమయ్యింది. @imVKohli ద్వారా అద్భుతమైన ఇన్నింగ్స్. మొత్తం జట్టుకు అభినందనలు” అని ఆయన ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: మెల్ బోర్న్ స్టేడియంలో జాతీయగీతం ఆలపిస్తూ రోహిత్ తన్మయత్వం

Exit mobile version